xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
జాతీయం

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి

26-10-2026 11:23
ఆస్ట్రేలియాలో నిర్వహించిన దసరా మిలన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందనీ, ఈ విషయంలో జరిగే దుష్ప్రచారాన్ని ప్రవాస భారతీయులు తిప్పికొట్టాలని ఆయన అన్నారు.
xPress24, Delhi, October 26, భారత్‌లోని ప్రతి రంగంలోనూ పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ‘దసరా మిలన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రవాస భారతీయులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్‌లోని విద్య, వైద్య రంగాలు ప్రస్తుతం అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో జరిగే దుష్ప్రచారాన్ని ప్రవాస భారతీయులు తిప్పికొట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో భద్రత మరింత పటిష్టమైందని చెప్పారు. ఆస్ట్రేలియాలోని ప్రవాసులు తమ మిత్రులకు భారత్‌లోని ప్రాచీన కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల విశిష్టతను పరిచయం చేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బైట్: కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.