తెలంగాణ
ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు సన్మానం
10-11-2026 10:07
సరైన ప్రోత్సాహం, ఉత్తమమైన శిక్షణ అందిస్తే కార్పొరేట్ కాలేజీల విద్యార్థులకు ధీటుగా రాణిస్తామని మహబూబ్ నగర్ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు చాటుతున్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పయనీర్ .. ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తోంది. పయనీర్ అందిస్తున్న శిక్షణతో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సన్మానించారు.
xPress24, Mahabubnager, November 9,
మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక శిక్ష అందిస్తున్నారు. పయనీర్ ద్వారా వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల పోటీల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులకు తోడ్పాటు అందిస్తోంది. ఇలా ప్రతి ఏటా 100 మందికి పైగా విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సన్మానం చేసి సర్టిఫికెట్లు అందజేశారు.
విద్యార్థులు సాధించిన ర్యాంకులే అంతిమ లక్ష్యం కాదని.. ఉన్నత చదువుల్లోనూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సూచించారు.
డిగ్రీలతో పాటు నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని, ఈ కార్యక్రమాలను మరో పదేళ్ల పాటు కొనసాగిస్తే వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు...
బైట్- యెన్నం శ్రీనివాస రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే