ఆంధ్రప్రదేశ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
27-10-2026 09:38

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
xPress24, Amaravati, October 27,