ప్రాంతీయం
ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.
04-11-2026 14:08

ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.
Xpress24 జంగారెడ్డిగూడెం 04-11-2026
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల ప్రభావితం కాని జిల్లాల్లో రేపు ఎంపీటీసీ ,జడ్పీటీసీ పోలింగ్ యధావిధిగా జరగనుంది. తుఫాను నేపథ్యంలో పోలింగ్ వాయిదా వెయ్యాలా ,వద్దా వద్ద అనే అంశంపై ఎస్.ఈ.సి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కువ చోట్ల ఇబ్బందులు లేవని కలెక్టర్లు చెప్పడంతో రేపు పోలింగ్ నిర్వహించాలన్నారు. అయితే గుంటూరులోని కాకుమాను , పెదనందిపాడు, ఫిరంగిపురం మండలాల్లో మాత్రం పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.