ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
05-11-2026 12:15
గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలోని కేంద్రీయ విద్యాలయం-2 పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం సందర్శించారు.
xPress24, Vijayawada, November 5,
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 5: గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలోని కేంద్రీయ విద్యాలయం-2 పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు.
పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ సరళి, ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అప్పటివరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.
ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు.