ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి
22-10-2026 15:58

రానున్న ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 22,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 22:
రానున్న ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పాలకొండ డీఎస్పీతో పాటు పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల ఎంపీడీవోలతో కలిసి రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, పార్కింగ్ సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడంతో పాటు, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రక్రియలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భద్రతతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.