xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలి

24-11-2026 12:16
ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలి
ఆంధ్రప్రదేశ్ లోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 99 పట్టణ స్థానిక సంస్థల అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీలోగా, చీరాల మున్సిపాలిటీలో పోటీ చేసినవారు డిసెంబర్ 21వ తేదీలోగా వివరాలు అందించాలని పేర్కొన్నారు. గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించని ఓడిన అభ్యర్థులు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడంతో పాటు మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
xPress24, Amaravathi, November 24, ఆంధ్రప్రదేశ్ లోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 99 పట్టణ స్థానిక సంస్థల అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీలోగా, చీరాల మున్సిపాలిటీలో పోటీ చేసినవారు డిసెంబర్ 21వ తేదీలోగా వివరాలు అందించాలని పేర్కొన్నారు. గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించని ఓడిన అభ్యర్థులు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడంతో పాటు మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.