ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు
24-10-2026 09:55

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడి, హోదాతో చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 14 ఎన్నికల సంబంధిత ఘటనలు నిన్న నమోదయ్యాయని తెలిపారు. వీటిపై కేసులు నమోదు చేసి 17 మందిని నిందితులుగా గుర్తించామని తెలిపారు. ఘర్షణల సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, అవసరమైన చోట అభ్యర్థులకు రక్షణ, ఎస్కార్ట్ కల్పించారని పేర్కొన్నారు. ఎన్నికల భద్రతను డిఐజిలు, ఐజిలు, ఎస్పిలు, పోలీసు కమిషనర్లు స్వయంగా పర్యవేక్షించాలని డిజిపి ఆదేశించారు.
xPress24, Mangalagiri, October 24,