ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
30-10-2026 09:50

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ హెచ్చరించారు.
xPress24, Tirupati, October 29,
తిరుపతి, అక్టోబర్ 29: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బైట్: వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి