xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది

05-11-2026 09:45
గన్నవరం మండలంలోని సెయింట్ జాన్స్ స్కూల్ నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.
xPress24, Gannavaram, November 4, గన్నవరం: గన్నవరం మండలంలోని సెయింట్ జాన్స్ స్కూల్ నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీఐ బి.వి. శివప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. గన్నవరం మండలంలో 11 రూట్ల పరిధిలోని 96 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి దాటి మాత్రమే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ముస్తాబాద్, సూరంపల్లి, అల్లాపురం గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా, గన్నవరం, కేసరపల్లి గ్రామాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.