xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
తెలంగాణ

ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కు ఘనంగా పున:స్వాగతం

24-11-2026 12:13
ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కు ఘనంగా పున:స్వాగతం
ప్రపంచ కృత్రిమ మేధ , చిప్ తయారీ దిగ్గజం ఎన్వీడియా సహ-వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో మరియు బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత ఆరోపణలు, విదేశీ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో కీలక పరిణామాల తర్వాత ఆయన తిరిగి సంస్థలోకి వచ్చారు. ఈ సందర్భంగా జెన్సన్ హువాంగ్ కు ఎన్విడియా సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్.. రెండో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతు.. మరింత మెరుగైన సీఈవోగా పనిచేస్తానని చెప్పారు.
xPress24, Hyderabad, November 24, ఉత్తాన-పతనాలు ఏఐ, చిప్ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన ఎన్వీడియా సహ-వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్..వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పిదాలతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అవమానకర రీతిలో ఈనెల 12న సీఈవో పదవికి  రాజీనామా చేశారు. ఆ తర్వాత సరిగ్గా 11 రోజుల వ్యవధిలోనే మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ఎన్విడియా సిబ్బంది, అగ్రదేశాల నేతలు ఆయనకు బాసటగా నిలిచారు. ఎన్విడియాలోకి  జెన్సన్ హువాంగ్ పునరాగమనాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. తేల్చిచెప్పిన ఎన్వీడియా బోర్డు అంతకుముందు జెన్సన్ హువాంగ్ రాజీనామాను ఎన్వీడియా బోర్డు ఆమోదించింది. అయితే జెన్సన్ తిరిగిరావాలని ఎన్విడియా సిబ్బంది ఆకాంక్షించారు. ఇందుకోసం సంతకాల సేకరణ కూడా చేశారు. ఎన్వీడియా బోర్డు అంగీకరిస్తే సంస్థలోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధమని జెన్సన్ తెలిపారు.  కానీ రాజీనామా ఆమోదాన్ని పున:పరిశీలించే అవకాశం లేదని ఎన్వీడియా బోర్డు తేల్చిచెప్పింది. జెన్సన్ హువాంగ్ కు మద్దతు ఈ పరిణామాలతో ఎన్విడియా సంస్థల షేర్లు కుప్పకూలాయి. దాంతో సంస్థ భవిష్యత్ పై ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు జెన్సన్ హువాంగ్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్,   ఎలాన్ మస్క్ తో పాటు పలువురు ప్రపంచ ప్రముఖులు మద్దతు తెలిపారు. జెన్సన్ కు మరో అవకాశం ఇవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోనూ తాను చర్చలు జరిపినట్టు ట్రంప్ ప్రకటించారు. మరవైపు  ట్రంప్ స్వయంగా బోర్డు సభ్యులతో మాట్లాడి హువాంగ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఒప్పించడమే కాకుండా, అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా ఆయన వల్ల దేశ జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని హామీ ఇచ్చారు. దీంతో బోర్డు డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఓటు వేసి హువాంగ్ పునర్ నియామకానికి ఆమోదం తెలిపారు. బ్లాక్ లిస్ట్ లో మెగాస్పీడ్ మరోవైపు, హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన రోజే అమెరికా వాణిజ్య శాఖ .. సింగపూర్‌కు చెందిన 'మెగాస్పీడ్'  సంస్థను వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. హువాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిస్ హువాంగ్ గతంలో ఈ సంస్థకు సీఈవోగా పనిచేశారు. అక్రమంగా అమెరికా చిప్‌లను చైనాకు తరలించారన్న ఆరోపణలపై ఈ సంస్థపై విచారణ కొనసాగుతోంది. హువాంగ్ రీఎంట్రీ తర్వాత ఎన్వీడియా షేర్లు 31 శాతం మేర ఎగసిపడి, కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 952 బిలియన్ డాలర్లు పెరిగింది. తాత్కాలిక సీఈవోగా పనిచేసిన కొలెట్ క్రెస్ తిరిగి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.