xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
తెలంగాణ

ఎంపీ ఈటెల పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు: ఈటెల క్షమిత

31-10-2026 12:12
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌తో ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఈటెల క్షమిత అన్నారు. డంపింగ్ యార్డు కారణంగా ఆ ప్రాంత ప్రజలు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు.
xPress24, Cherala Bandlaguda, October 31, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌తో ఈటెల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. నాలుగో రోజు పాదయాత్రలో భాగంగా చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు కోడలు ఈటెల క్షమిత కూడా పాల్గొని ప్రజలతో కలిసి అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఈటెల క్షమిత మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే లక్ష్యంతోనే ఎంపీ ఈటెల రాజేందర్ పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ముఖ్యంగా వేలాదిమంది మహిళలు తమతో కలిసి అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ కారణంగా ఈ ప్రాంతమంతా కాలుష్య సమస్యను ఎదుర్కొంటోందని, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు తరలివస్తున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపు కోసం తమకు ఒక నాయకుడు అండగా నిలిచారనే నమ్మకంతో ప్రజలు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని క్షమిత తెలిపారు. మహిళల భారీ భాగస్వామ్యమే పాదయాత్రకు లభిస్తున్న ప్రజా స్పందనకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బైట్: ఈటెల క్షమిత, బీజేపీ నేత

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.