ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
05-11-2026 09:57

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 31 వేల 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 9 వేల 821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2 వేల 51 స్థానాలు ఏకగ్రీవమవ్వగా.. మిగిలిన 7 వేల 770 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 659 జడ్పీటీసీ స్థానాల్లో 77 ఏకగ్రీవం కాగా, మిగిలిన 582 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
xPress24, Amaravati, November 5,