ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు గడువు నిన్నటితో ముగిసింది
24-10-2026 09:57

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు గడువు నిన్నటితో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల వేసేందుకు నిన్నచివరిరోజు కావడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజే ఎంపీటీసీ స్థానాలకు 25 వేల 16 అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలకు 3 వేల 315 నామినేషన్లు దాఖలయ్యాయి. గత మూడు రోజుల్లో ఎంపీటీసీ స్థానాలకు 51 వేల 902 జడ్పీటీసీ స్థానాలకు 5 వేల 724 చొప్పున మొత్తం 57 వేల 626 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
xPress24, Vijayawada, October 24,