xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
తెలంగాణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

17-11-2026 10:29
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
వీణవంక పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వాయిస్ శాంపిల్ ఇవ్వాలన్న పోలీసుల నోటీసులపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
xPress24, Hyderabad, November 16, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కరీంనగర్ సీపీని దూషించారనే ఫిర్యాదు మేరకు వీణవంక పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాయిస్ శాంపిల్ నోటీసులపై విచారణ ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాయిస్ శాంపిల్ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా దర్యాప్తు అవసరాల నిమిత్తం పోలీసులు వాయిస్ శాంపిల్స్ సేకరిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం, కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.