xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

ఎరువుల విక్రయాలు, పంపిణీలో పారదర్శకత పాటించాలి: జాయింట్ కలెక్టర్ వైశాలి ఆర్.

20-11-2026 10:00
ఎరువుల విక్రయాలు, పంపిణీలో పారదర్శకత పాటించాలి: జాయింట్ కలెక్టర్ వైశాలి ఆర్.
ఎరువుల విక్రయాలు, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వైశాలి ఆర్. అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, November 19, పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 19: ఎరువుల విక్రయాలు, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వైశాలి ఆర్. అధికారులను ఆదేశించారు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు చేపడుతున్న విధానాన్ని పరిశీలించారు. యాప్‌లో రైతుల వివరాల నమోదు, ఎరువుల కొనుగోలు, పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడంతోపాటు, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ వినియోగంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహకారం అందించాలని దుకాణ సిబ్బందిని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.