తెలంగాణ
ఎల్ నినో ప్రభావం ఎదుర్కోవడంపై మంత్రి సీతక్క సమీక్ష
29-10-2026 09:42

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి కల్పనపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
xPress24, Hyd, October 28,
ఈ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని, వలసలను నివారించేలా ప్రతి గ్రామ పంచాయతీలో పనులు ప్రారంభించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అక్టోబర్ 27న ఉపాధి పనులకు 3 లక్షల 97వేల 788 మంది కూలీలు హాజరుకావడం రికార్డుగా పేర్కొన్న మంత్రి, కూలీల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
....
రాష్ట్రంలోని 12,516 గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభం కాగా, మిగిలిన 244 పంచాయతీల్లో వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని, నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవోలు ప్రత్యేక శ్రద్ధతో చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.