xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి: మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్

27-11-2026 09:33
ఎల్ నినో ప్రభావం దృష్ట్యా యాసంగి సీజన్‌లో తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రైతులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి తావులేదని, తొర్రూరులో అవినీతికి పాల్పడిన వార్డు అధికారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వి.బి.జి. రామ్ ద్వారా 125 రోజుల పని దినాలు కల్పిస్తూ ఉపాధి పనులను వేగవంతం చేశామని, నీటి సంరక్షణ కోసం ఫామ్ పాండ్స్ నిర్మిస్తున్నామని వివరించారు.
xPress24, MAHABUBABAD, November 26, ఎల్ నినో ప్రభావం దృష్ట్యా యాసంగి సీజన్‌లో తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రైతులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సొసైటీలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు సైతం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి తావులేదని, తొర్రూరులో అవినీతికి పాల్పడిన వార్డు అధికారిని సస్పెండ్ చేసినట్లు స్నేహ శబరీష్ వెల్లడించారు. 125 రోజుల పని దినాలతో ముమ్మరంగా వి.బి.జి. రామ్ పనులు జిల్లాలో వి.బి.జి. రామ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ పథకం ద్వారా 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గత ఏడాది ఉపాధి హామీ పథకం కింద రూ. 47 కోట్ల విలువైన పనులు చేపట్టగా, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ. 37 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు వివరించారు. నీటి సంరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నీటి గుంటలు, ఫామ్ పాండ్స్ నిర్మాణం చేపడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బైట్స్ స్నేహ శబరీష్, జిల్లా కలెక్టర్, మహబూబాబాద్

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.