xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
తెలంగాణ

ఎల్-నినో ప్రభావంపై ఆదిలాబాద్‌లో విద్యార్థుల అవగాహన ర్యాలీ

06-11-2026 14:27
ఆదిలాబాద్ శాంతి నగర్ నుంచి వినాయక్ చౌక్ వరకు విద్యార్థులు ఎల్-నినో ప్రభావం, నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వినాయక్ చౌక్ వద్ద ప్రదర్శించిన వీధి నాటిక ఆకట్టుకుంది. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.
xPress24, Adilabad, November 6, ఎల్-నినో ప్రభావం, నీటి పొదుపు ఆవశ్యకతపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శాంతి నగర్ కాలనీ నుంచి వినాయక్ చౌక్ వరకు ప్రధాన వీధుల గుండా ఈ ప్రదర్శన సాగింది. విద్యార్థులు ప్లకార్డులు చేతబూని నీటి సంరక్షణపై నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించారు. వినాయక్ చౌక్ వద్ద ఆకట్టుకున్న వీధి నాటిక ర్యాలీ అనంతరం వినాయక్ చౌక్ కూడలిలో విద్యార్థులు ప్రదర్శించిన వీధి నాటిక ఆలోచింపజేసింది. ఎల్-నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే తీరు, రాబోయే నీటి ఎద్దడి, వాటిని ఎదుర్కొనే పద్ధతులను నాటిక రూపంలో కళ్లకు కట్టారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి నీటిబొట్టునూ పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపాధ్యాయుడు వేదవ్యాస్ పేర్కొన్నారు. వృథాను అరికట్టడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. బైట్స్ వేదవ్యాస్, ఉపాధ్యాయుడు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.