ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ
05-11-2026 12:18
ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.
xPress24, Mahabubnager, November 5,
మహబూబ్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. . ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని, ప్రజలకు తాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను గతంలోనే పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితులు తలెత్తేవి కావని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతాంగం సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు...కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అండగా నిలవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాలను కోరారు…