తెలంగాణ
ఎల్‌నినో ప్రభావంపై విపక్షాలవి అనవసర ఆరోపణలు: మంత్రి అడ్లూరి
24-10-2026 14:49

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
xPress24, Hyderabad, October 24,
ఎల్ నినో తెలంగాణకే పరిమితమైన అంశం కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివరించారు. సీఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థతి ఉంది. వచ్చే ఏడాది జులై వరకూ అప్రమత్తంగా ఉండాలి. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటిని ప్రణాళికాబద్ధంగా వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది’’ అని అడ్లూరి తెలిపారు.