తెలంగాణ
ఎల్‌నినో, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలి - CS సంజయ్ జాజు
24-10-2026 09:39

ఎల్‌నినో వల్ల తలెత్తే పరిణామాలు, వాతావరణ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రవీంద్రభారతిలో సమాచార శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో CS మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడటంపై జానపద కళారూపాలు, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 23,