xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

ఎల్‌నినోపై భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ

21-10-2026 09:30
తెలంగాణలో ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, వాకిటి శ్రీహరి ఇందులో సభ్యులుగా ఉంటారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలపై ఈ కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది.
xPress24, hyderabad, October 20, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణను సిఫారసు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం కీలక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో ఆరుగురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ మంత్రివర్గ ఉపసంఘంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా వ్యవహరించనున్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జల మట్టాలు పడిపోయే అవకాశం ఉన్నందున, గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతను అంచనా వేస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నిరంతరం సమీక్షించి ప్రభుత్వానికి తగిన నివేదికలు, సిఫారసులు అందించడమే ఈ ఉపసంఘం ప్రధాన బాధ్యతని అధికారులు పేర్కొన్నారు.

🎥 వీడియో

ఎల్‌నినోపై భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.