తెలంగాణ
ఎస్టీల సమస్యల పరిష్కారానికి కమిషన్ కోర్టులు అస్త్రం: హుస్సేన్ నాయక్
13-11-2026 11:59
షెడ్యూల్ తెగల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కోర్టులను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని ఆ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హక్కుల సాధనకు ఒక ఆయుధం లాంటిదని, దీనిని షెడ్యూల్ తెగల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
xPress24, Nalgonda, November 13,
షెడ్యూల్ తెగల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కోర్టులను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని ఆ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హక్కుల సాధనకు ఒక ఆయుధం లాంటిదని, దీనిని షెడ్యూల్ తెగల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన, దేవరకొండ, కొండమల్లేపల్లి, తిరుమలగిరి సాగర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దేవరకొండ మండలంలోని వెంకట్ తండా, బొల్లిగుట్ట తండా, కాచారం గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా దేవరకొండ మండలంలో మైనింగ్ కార్యకలాపాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, రహదారులు, విద్యుత్ సమస్యలు, భూముల పట్టాలకు సంబంధించిన ఇబ్బట్లపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అలాగే, కొండమల్లేపల్లి మండలం గాజీ నగర్ గ్రామంలో నెలకొన్న రోడ్లు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. షెడ్యూల్ తెగల ప్రజల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, ఎవరైనా ఎస్టీలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారంగా కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గిరిజనులు తమ సమస్యలను ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భరోసా కల్పించారు. అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాత్రి 12 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. సమీక్ష ముగిసిన అనంతరం హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
బైట్...
హుస్సేన్ నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు