ఆంధ్రప్రదేశ్
ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం
05-11-2026 15:49
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
xPress24, Amaravati, November 5,
అమరావతి, నవంబరు 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన జీఓ ఎంఎస్ నంబర్ 87 ద్వారా ఆయనను ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
బినోయ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రమాణ స్వీకారం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ బినోయ్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో పాటు పలువురు అధికారులు కూడా పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఏపీఈఆర్‌సీ సభ్యులు పి.వి.ఆర్. రెడ్డి, ఏపీ నెరెడ్క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు, ఏపీఈఆర్‌సీ కార్యదర్శి పి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.