xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు

20-11-2026 15:42
ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
xPress24, Amaravati, November 20, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మైనింగ్ శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, వాటి సమర్థ వినియోగంపై చర్చించారు. ఖనిజ వనరులను కేవలం ఆదాయార్జన సాధనాలుగా మాత్రమే చూడకుండా, భవిష్యత్తు తరాలకు విలువైన ఆస్తులుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఏపీఎండీసీ పరిధిలోని ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. సంస్థను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు వచ్చే ఏడాది డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఐపీఓ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా అంచనా వేసినట్లు వివరించారు. ఖనిజ వనరుల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల లభ్యతను పెంచుకునేందుకు విదేశాల్లో మైనింగ్ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సమకూర్చేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొననుందని వెల్లడించారు. ఈ మూడు బ్లాకుల్లో కలిపి 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారని తెలిపారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా 582 ఖనిజ సంభావ్యత ప్రాంతాలను గుర్తించినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.