ప్రాంతీయం
ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు
04-11-2026 12:49
ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు
Xpress24 జంగారెడ్డిగూడెం 04-11-2026
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల దుస్థితి వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందు లకు గురవుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా రహదారులపై నీరు నిలిచిపోవడంతో, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానిక నివాసులు ఇళ్లలోకి వర్షపు నీరు చొచ్చుకొని రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా ఒకవైపు తీవ్ర కరెంటు కోతతో పట్టణ ప్రజలు అల్లల్లాడిపోతున్నారు.
మరోవైపు రోడ్లపై గుంతలు, మురుగునీటి సమస్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు సకాలంలో బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.