ప్రాంతీయం
ఏలూరు జిల్లాలో 1 గంటకు 43.74 శాతం పోలింగ్ నమోదు!
05-11-2026 15:43

ఏలూరు జిల్లాలో 1 గంటకు 43.74 శాతం పోలింగ్ నమోదు!
Xpress24 Jangareddygudem 05-11-2026
ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 43.74 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలోని పెదవేగి మండలం 54.77 శాతంతో అత్యధిక పోలింగ్ నమోదు చేయగా, భీమడోలు మండలం 27.33 శాతంతో అత్యల్పంగా నిలిచింది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 లక్షల 62 వేల 523 మంది ఓటర్లకు గాను, ఇప్పటివరకు 5 లక్షల 8 వేల 545 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 2 లక్షల 53 వేల 289 మంది పురుషులు, 2 లక్షల 55 వేల 256 మంది మహిళలు ఉన్నారు.