xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

05-11-2026 15:49
ఓటు హక్కు భారత ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప వరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
xPress24, Avanigadda, November 5, కృష్ణ జిల్లా, అవనిగడ్డ, నవంబర్ 5: ఓటు హక్కు భారత ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప వరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన భార్య విజయలక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజాసేవా దృక్పథం, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన వారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని, ప్రజాస్వామ్యం కల్పించిన ఈ మహత్తర అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని ఎమ్మెల్యే కోరారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.