ఆంధ్రప్రదేశ్
ఓటర్ స్లిప్పుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
21-10-2026 16:26

జీవీఎంసీ పరిధిలోని ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందించాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.
xPress24, Visakhapatanam, October 21,
విశాఖపట్నం, అక్టోబర్ 21: జీవీఎంసీ పరిధిలోని ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందించాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఇతర ముఖ్య సిబ్బందితో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓటర్లు తమ ఓటు హక్కును ఏ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోవాలో తెలుసుకునేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి, పోలింగ్ నిర్వహణకు అనువుగా అన్ని ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేతన్ గార్గ్ ఆదేశించారు.