xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు: జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

31-10-2026 10:14
ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు: జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
xPress24, Eluru, October 30, ఏలూరు, అక్టోబర్ 30: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం స్థానిక సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సుల సీల్స్ తొలగించడం, ఓట్ల లెక్కింపు, చెల్లుబాటు అయ్యే ఓట్లను గుర్తించడం తదితర అంశాలపై సిబ్బందికి స్వయంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఓట్ల చెల్లుబాటుపై ఏవైనా సందేహాలు తలెత్తితే వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమతిలేని వస్తువులను తీసుకురావడానికి వీలులేదని, వాటిని బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో భద్రపరచాలని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, కౌంటింగ్ హాళ్లు, టేబుళ్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.