ఆంధ్రప్రదేశ్
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం
09-11-2026 18:16

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం
XPress24 Jangareddygudem 09-11-2026
ఉద్యోగులు CPS నుంచి OPS (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)కు మారేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2004 SEP 1కి ముందు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీన లేదా ఆ తర్వాత డ్యూటీలో చేరిన వారికి వన్ టైమ్ ఆప్షన్ కల్పించింది. 2026 DEC 31లోగా 'నిధి' పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సర్వీసులో ఉన్నవారు, రిటైరైన వారు, ఫ్యామిలీ పెన్షనర్లూ ఆప్షన్ ఎంచుకోవచ్చని పేర్కొంది.