ఆంధ్రప్రదేశ్
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
05-11-2026 12:16
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు క్రమంగా చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
xPress24, Kakinada, November 5,
కాకినాడ, నవంబర్ 5:
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు క్రమంగా చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
జిల్లాలోని 1,317 పోలింగ్ కేంద్రాల్లో 20 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఉదయం 10 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 8.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.