ఆంధ్రప్రదేశ్
కాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
30-10-2026 14:42

కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను కారణంగా జరిగిన నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
xPress24, Mangalagiri, October 30,
అమరావతి: కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను కారణంగా జరిగిన నష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులతో మాట్లాడి తుపాను నష్టం, పునరుద్ధరణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. తుపాను వల్ల జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్, మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.