xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
ఆంధ్రప్రదేశ్

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

13-11-2026 09:34
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
xPress24, Kakinada, November 12, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సన్నద్ధత, సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిందని, ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మేయర్ పదవికి సంబంధించిన నామినేషన్లను నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 66 వార్డుల వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 17 ప్రాంతాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 17న నామినేషన్ల పరిశీలన, 19వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఈ నెల 26న నగరపాలక సంస్థ పరిధిలోని 66 వార్డులకు 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే రోజు గ్రామపంచాయతీల తొలి విడత ఎన్నికల పోలింగ్ కూడా జరగనుందని పేర్కొన్నారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 2,85,949 మంది ఓటర్లు ఉన్నారని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు వెయ్యి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం 1,836 మంది సిబ్బందిని నియమించామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం 18 రూట్లు, 6 జోన్లుగా విభజించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన స్టేషనరీ, వివిధ రకాల ఫారాలు, కవర్లు, చెరగని సిరా తదితర సామగ్రిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మొత్తం 673 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ సామగ్రి పంపిణీని స్థానిక మెక్లారిన్ పాఠశాల నుంచి చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను స్థానిక రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.