xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
జాతీయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

26-11-2026 11:58
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై సీబీఐ, ఈడీతో విచారణ జరింపించాలని ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
xPress24, Delhi, November 25, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ సీబీఐ , ఈడీలకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మొదటి నుంచి తాజాగా విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదా కాదా అనే అంశంతో పాటు, ఇందులోని అన్ని అంశాలపై రాహుల్ గాంధీ వాదనలను తప్పనిసరిగా వినాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ విఘ్నేష్ శిశిర్ గతంలో అలహాబాద్ హైకోర్టులో క్రిమినల్ రిట్ పిటిషన్ వేశారు. దీనిపై మే నెలలో విచారణ జరిపిన హైకోర్టు లక్నో ధర్మాసనం.. స్పందించాలని సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ లను ఆదేశించింది. తమకు ఫిర్యాదులు అందాయని, చట్టప్రకారం వాటిని పరిశీలిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడంతో, తగిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 17న విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తదుపరి ప్రక్రియపై స్టే విధిస్తూ, దర్యాప్తు సంస్థలు ఎలాంటి నివేదికలు సమర్పించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏ వ్యక్తిపైనైనా ఆదాయానికి మించిన ఆస్తుల సమాచారం ఉంటే, కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా ముందుకెళ్లవచ్చని నాడు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తాజాగా విచారణ పూర్తి చేసిన సీజేఐ ధర్మాసనం, రాహుల్ గాంధీకి తన వాదన వినిపించే అవకాశం ఇస్తూ, పిటిషన్ విచారణార్హతపై తిరిగి మొదటి నుంచి విచారణ జరపాలని హైకోర్టుకు కేసును బదిలీ చేసింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.