తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు - కేటీఆర్ విమర్శలు
24-10-2026 09:42

రాష్ట్రంలో పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వచ్చాయని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద నీరు వచ్చినా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పంపులను నడపలేదని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతుండటంతో తెలంగాణ రైతులు ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటలకు పారించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
xPress24, HYDERABAD, October 23,