తెలంగాణ
కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందేలా ఏర్పాట్లు చేయాలి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
18-11-2026 10:28
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని సూచించారు. గురువారం సిద్దిపేట బహిరంగ సభలో రూ. 5 లక్షల జీవిత బీమా అందించే ఇందిరమ్మ బీమా దరఖాస్తుతో పాటు అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.
xPress24, Hyderabad, November 18,
రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఇందులో భాగంగా గురువారం సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తు ప్రక్రియను సీఎం ప్రారంభించనున్నారు. తన నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం దిశానిర్దేశం చేశారు.
ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా.. చీరల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందనుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలకు ఇది భరోసా కల్పిస్తుందన్నారు. సిద్దిపేట బహిరంగ సభ వేదికపైనే అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. చీరల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.