ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్
30-10-2026 09:49

స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ గురువారం విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
xPress24, Vizianagaram, October 29,
విజయనగరం, అక్టోబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ గురువారం విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)కు చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.