ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
06-11-2026 14:26

ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
xPress24, Vijayawada, November 5,
విజయవాడ: ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మండలాల వారీగా కౌంటింగ్ కేంద్రాల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఎ.కొండూరు, విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు తిరువూరులోని శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం, ఓల్డ్ మాంటిస్సోరి కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. జి.కొండూరు మండలానికి కుంటముక్కలలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో, ఇబ్రహీంపట్నం మండలానికి కొండపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్ కళాశాలలో, నందిగామ మండలానికి నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. చందర్లపాడు మండలానికి నందిగామలోని కేవీఆర్ డిగ్రీ కళాశాలలో, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు కంచికచర్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వివరించారు.