xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి - మంత్రి కొలుసు పార్థసారథి

26-10-2026 14:21
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి - మంత్రి కొలుసు పార్థసారథి
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రజలకు పిలుపునిచ్చారు.
xPress24, Nuzividu, October 26, నూజివీడు: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నూజివీడు మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ వార్డుల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వార్డుల్లోని సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 100 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే వార్డుల పరిధిలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించడంతో పాటు, కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.