ఆంధ్రప్రదేశ్
కొఠియా గ్రామాలపై మంత్రి స్పందన
05-11-2026 10:12

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల గిరిజనులను ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా అధికారులు అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంత్రి ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 29 గిరిజన గ్రామాల ప్రజలను ఎన్నికలు బహిష్కరించాలని బెదిరించడం తగదన్నారు. ఓటు వేయడానికి వస్తారనే కారణంతో ఆంక్షలు విధించడం, గిరిజనుల వాహనాలను స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.కొఠియా గ్రామాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లో ఉందని మంత్రి తెలియజేశారు.
xPress24, Saluru, November 5,