తెలంగాణ
కొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరు
28-09-2026 16:58

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16లక్షల 32వేల 810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
xPress24, HYDERABAD, September 28,