తెలంగాణ
కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన.. రూ.3.35 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
13-11-2026 11:59
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి పర్యటించి రూ. 3.35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరు స్త్రీ శక్తి భవనాలు, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.
xPress24, SURYAPET, November 13,
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి గురువారం పర్యటించారు. రూ. 3.35 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరు స్త్రీ శక్తి భవనాలు, ఒక 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. తక్కువ నీటి పంటలు సాగు చేయాలని పిలుపు
ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు, రైతులకు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని రెండు మండలాలను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో, రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రారంభించామన్నారు. రైతులు తక్కువ నీటి వినియోగంతో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని, ప్రజలు ఇప్పుడే నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
బైట్స్
నలమాద పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యే, కోదాడ