తెలంగాణ
కోదాడలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన: వానాకాలం నాటికి సాగునీరు అందించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
12-11-2026 09:40
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రూ. 101 కోట్ల వ్యయంతో చేపడుతున్న రెడ్లకుంట్ల, రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో జాప్యాన్ని నివారించి వచ్చే వానాకాలం నాటికి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాలు పూర్తయితే వేలాది ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
xPress24, SURYAPET, November 11,
సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెడ్లకుంట్ల, రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్లకుంట్ల వద్ద రూ. 47 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ. 54 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు.
పనుల్లో జాప్యంపై ఆగ్రహం.. వచ్చే సీజన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టీకరణ
పనుల్లో జరుగుతున్న జాప్యంపై అధికారులను ప్రశ్నించిన మంత్రి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికి రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కోదాడ నియోజకవర్గ పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
బైట్స్
ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి
కుందూరు రఘువీర్ రెడ్డి, ఎంపీ, నల్గొండ