xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణకరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
జాతీయం

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తగ్గిన క్యాన్సర్ ఔషధాల ధరలు

10-11-2026 11:53
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తగ్గిన క్యాన్సర్ ఔషధాల ధరలు
క్యాన్సర్ బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భారీ నిర్ణయం అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకున్న చర్యలతో 1,364 క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి. 679 బ్రాండ్ల ధరలు 50 శాతం కంటే ఎక్కువ తగ్గడంతో క్యాన్సర్ రోగులకు వైద్య ఖర్చుల విషయంలో భారీ ఉపశమనం దక్కనుంది.
xPress24, Delhi, November 10, క్యాన్సర్ రోగులకు ఔషధాల విషయంలో  కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. మొత్తం  137 రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నివారణ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్  ద్వారా 137 రకాల క్యాన్సర్ మందుల గరిష్ట విక్రయ ధరలు వాటి ప్రస్తుత ధరల ఆధారంగా 70శాతం వరకు తగ్గాయి. కొన్ని బ్రాండ్లపై ఈ తగ్గింపు మరింత ఉంది. ఈ నిర్ణయం వల్ల వివిధ ఫార్మా కంపెనీలకు చెందిన దాదాపు 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల ధరలు తగ్గాయి. ఇందులో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ప్రాణాధార మందులు ఉన్నాయి. క్యాన్సర్ రోగులకు ఔషధాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలుపై మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.  అన్ని రిటైల్ మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆసుపత్రులు మారిన కొత్త ధరలను మాత్రమే వసూలు చేయాలి.  ప్రతి ఫార్మసీ తమ వద్ద సవరించిన క్యాన్సర్ మందుల ధరల పట్టికను వినియోగదారులకు కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.