తెలంగాణ
క్యూర్ పరిధిలో లోటు వర్షపాతం
24-10-2026 13:03

ఎల్నినో ప్రభావంతో క్యూర్ పరిధిలోని మూడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో అక్టోబరు 23 నాటికి 458.5 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.
xPress24, Hyderabad, October 24,
ఎల్నినో ప్రభావంతో క్యూర్ పరిధిలోని మూడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో అక్టోబరు 23 నాటికి 725.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 458.5 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 37 శాతం లోటు వర్షపాతం అని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదికలో వెల్లడించారు. మేడ్చల్-మల్కాజిగిరిలో సాధారణం కంటే 41 శాతం, రంగారెడ్డి జిలాల్లో 25 లోటు వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఈ స్థాయిలో లోటు వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.