xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
ఆంధ్రప్రదేశ్

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్ క్షమాపణలు

26-11-2026 14:25
కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్ క్షమాపణలు
కార్తిక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సిక్కందర్‌ దర్గా వద్ద పురాతన రాతి స్తంభంపై ఈ ఏడాది మాత్రమే దీపాన్ని వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేకపోయామని క్షమాపణలు చెప్తూ తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
xPress24, chennai, November 26, తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై  ఉన్న సిక్కందర్‌ దర్గా వద్ద పురాతన రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించాలనే దానిపై వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అక్కడే దీపం వెలిగించాలని గత ఏడాది మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వగా అవి అమలు కాలేదు. ఈ ఏడాది మాత్రమే రాతి స్తంభంపై కార్తికదీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులనూ మంగళవారం పాటించలేదు. ఆలయ యంత్రాంగం అనుమతించకపోవడం వల్లే రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయామని క్షమాపణ చెప్తూ బుధవారం తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయడానికి తాను అన్నివిధాలుగా ప్రయత్నించానని మధురై కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. కొండపై ఉన్న రాతిస్తంభం వద్ద దీపాన్ని వెలిగించడం వల్ల తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్టీలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు. దాంతో తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్‌ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగిందని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ చర్యను కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.