తెలంగాణ
కరీంనగర్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు
24-11-2026 12:13
యాదవుల ఐక్యతకు సదర్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. కరీంనగర్‌లోని జ్యోతిబా ఫూలే మైదానంలో సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఏటా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
xPress24, Karimnagar, November 24,
ఇకపై ప్రతి ఏడాది అన్ని జిల్లాల్లో సదర్ వేడుకలను ఘనంగా జరుగుతాయని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ లో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన మూడేళ్లుగా హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి ఈ వేడుకను రాష్ట్ర పండుగగా ప్రకటించి రూ. 5 కోట్ల నిధులు కేటాయించడంతో ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మండల కేంద్రాల్లోనూ సదర్ ఉత్సవాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంప్రదాయాలకు సదర్ ఉత్సవాలు నిదర్శనమని చెప్పారు. యాదవులంటే నమ్మకానికి, ధైర్యసాహసాలకు మారుపేరని చెప్పారు. ప్రతి సంవత్సరం కరీంనగర్ నగరంలో అన్ని కులాల వారిని కలుపుకొని సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
సదర్ వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, సదర్ ఉత్సవ నిర్వాహకులు, పట్ణణ ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన పలు ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
బైట్- అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ, సికింద్రాబాద్
మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి
గంగుల కమలాకర్, ఎమ్మెల్యే, కరీంనగర్
రవి యాదవ్, నిర్వాహకుడు, సదర్ ఉత్సవ కమిటి, ఉమ్మడి కరీంనగర్