xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
తెలంగాణ

కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు

29-10-2026 09:49
కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు  చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కరవు పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు అవసరమైన సహాయం కోరుతామని వెల్లడించారు.రాష్ట్రంలో కరవు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమష్టి కార్యాచరణ రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
xPress24, Hyderabad, October 29, ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం  చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి  అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం బుధవారం  జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కరవు పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి  తెలంగాణకు  అవసరమైన సహాయం కోరుతామని వెల్లడించారు.రాష్ట్రంలో కరవు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమష్టి కార్యాచరణ రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.